రేపు దిల్ రాజు నుంచి భారీ అనౌన్స్‌మెంట్‌... 'బోల్డ్‌... బిగ్‌... బియాండ్ ఇమాజినేష‌న్' అంటూ ట్వీట్‌!

Dil Rajus Big Announcement Tomorrow
  • ఎక్స్ లో ఎస్వీసీ ఆసక్తికర పోస్టు 
  • బోల్డ్‌.. బిగ్‌.. బియాండ్ ఇమాజినేష‌న్' అంటూ ట్వీట్‌
  • ఫిల్మ్ నగర్ వర్గాల్లో భారీగా చర్చ
టాలీవుడ్ బ‌డా నిర్మాత దిల్ రాజు నుంచి రేపు ఓ భారీ అనౌన్స్‌మెంట్ రానుంది. ఆయ‌న నిర్మాణ సంస్థ శ్రీ వేంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ ఈ విష‌యాన్ని 'ఎక్స్' (ట్విట్ట‌ర్‌) వేదిక‌గా ప్ర‌క‌టించింది. ఈ మేర‌కు "బోల్డ్‌... బిగ్‌... బియాండ్ ఇమాజినేష‌న్" అంటూ ట్వీట్ చేసింది. రేపు ఉద‌యం 11.08 గంట‌ల‌కు ఈ భారీ ప్ర‌క‌ట‌న ఉంటుంద‌ని త‌న 'ఎక్స్' పోస్టులో ఎస్‌వీసీ పేర్కొంది. 

కాగా, ఇటీవ‌ల ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు వంశీ పైడిప‌ల్లి బాలీవుడ్ మిస్ట‌ర్ ప‌ర్ఫెక్ట్ ఆమిర్ ఖాన్‌కు ఓ ఆస‌క్తిక‌ర స్టోరీ లైన్ వినిపించార‌ని వార్త‌లు వ‌చ్చిన విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో రేపు వ‌చ్చే ప్ర‌క‌ట‌న ఈ ప్రాజెక్ట్ గురించేనా అన్న చ‌ర్చ ఫిల్మ్ వ‌ర్గాల్లో న‌డుస్తోంది. ఏదేమైనా రేపు ఉద‌యం 11.08 గంట‌ల‌కు ఈ విష‌యంలో ఒక క్లారిటీ వ‌స్తుంది. 
Go Back to Shorts
Dil Raju
Dil Raju announcement
Sri Venkateswara Creations
Tollywood
Telugu cinema
Big announcement
Vamshi Paidipally
Aamir Khan
Bollywood
Upcoming Telugu movie

More Telugu News