షిరిడీసాయి ఆలయంలో మోహన్‌బాబు ప్రత్యేక పూజలు

  • కన్నప్ప చిత్రం విజయం సాధించాలని సాయినాథుడి ఆశీస్సులు తీసుకున్నానన్న మోహన్ బాబు
  • మే నెలాఖరు లేదా జూన్ మొదటి వారంలో సినిమా విడుదల అవుతుందని వెల్లడి
  • మోహన్ బాబును సత్కరించిన సంస్థాన్ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ అధికారి భీమరాజ్ దరాడే 
ప్రముఖ సినీ నటుడు, నిర్మాత మంచు మోహన్‌బాబు మంగళవారం షిరిడీ సాయి నాథుడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆయన నిర్మించిన ‘కన్నప్ప’ చిత్రం త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో, ఆ చిత్రం విజయం సాధించాలని నిర్మాతగా షిరిడీ సాయిబాబాను కోరుకున్నట్లు ఆయన తెలిపారు.

చిత్రంలో తన కుమారుడు విష్ణు హీరోగా (కన్నప్ప) నటించాడని, ప్రభుదేవా, అక్షయ్ కుమార్ కూడా నటించారని మోహన్‌బాబు చెప్పారు. తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ‘కన్నప్ప’ సినిమా ఒకే రోజు విడుదల అవుతుందని వెల్లడించారు. మే నెలాఖరున లేదా జూన్ మొదటి వారంలో ఈ చిత్రం విడుదల అవుతుందని ఆయన తెలిపారు.

కొత్త సినిమా విడుదల సమయంలో సాయిబాబాను దర్శించుకోవడం తనకు ఆనవాయితీ అని మోహన్ బాబు పేర్కొన్నారు. సాయిబాబా దర్శనం అనంతరం మోహన్‌బాబును సాయి సంస్థాన్ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ అధికారి భీమరాజ్ దరాడే శాలువాతో సత్కరించి, సాయిబాబా విగ్రహం అందజేశారు. 


More Telugu News