ఇండస్ట్రీలోకి రావడానికి తెలుగు అమ్మాయిలు భయపడుతున్నారు: వైష్ణవి చైతన్య

  • 'బేబి' సినిమాతో స్టార్ గా మారిన వైష్ణవి
  • ఇండస్ట్రీలో తెలుగు అమ్మాయిలకు ఆఫర్లు రావనే ప్రచారం జరిగిందన్న వైష్ణవి
  • గట్టిగా ప్రయత్నిస్తే అవకాశాలు వస్తాయని వ్యాఖ్య
షార్ట్ ఫిల్మ్ లతో కెరీర్ మొదలు పెట్టి, వెబ్ సిరీస్ లతో పాప్యులర్ అయిన అచ్చ తెలుగు అమ్మాయి వైష్ణవి చైతన్య... తొలి సినిమా 'బేబి'తో స్టార్ అయిపోయింది. ప్రస్తుతం హీరో సిద్దూ జొన్నలగడ్డ సరసన 'జాక్' మూవీలో నటిస్తోంది. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి సంబంధించిన పోస్టర్స్, టీజర్, ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ లో వైష్ణవి చేసిన ఆసక్తికర వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. 

టాలీవుడ్ లో తెలుగు అమ్మాయిలకు అవకాశాలు రావు అనే ప్రచారం ఎందుకు జరిగిందో కానీ... ఆ ప్రచారం వల్లే చాలా మంది అమ్మాయిలు ఇండస్ట్రీకి రావాలనే ఆలోచన చేయడం లేదని వైష్ణవి చెప్పింది. ఇండస్ట్రీలోకి రావాలనే ప్రయత్నమే చేయకపోతే ఎలాగని ప్రశ్నించింది. ఓపికతో ప్రయత్నిస్తే అవకాశాలు వస్తాయని... దానికి తానే ఉదాహరణ అని చెప్పింది. అవకాశాలు రావు అని భయపడి ఆగిపోయే బదులు గట్టిగా ప్రయత్నిస్తే అవకాశాలు మీ తలుపు తడతాయని... ఇండస్ట్రీలోకి రావాలనుకునేవారికి ఇదే తానిచ్చే సలహా అని చెప్పారు.


More Telugu News