Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

జీవన ప్రమాణాలు పెంచే విధంగా మన విద్యా విధానం ఉండాలి: రేవంత్ రెడ్డి

Revanth Reddy Advocates for Education Policy Boosting Living Standards
Advertisement
  • ఉత్తమ విద్యా వ్యవస్థ కోసం పాలసీ తయారు చేయాలని విద్యాశాఖ అధికారులకు ఆదేశం
  • క్షేత్రస్థాయి పరిస్థితులకు అనుగుణంగా ఆచరణ సాధ్యమయ్యేలా పాలసీ ఉండాలన్న సీఎం
  • జీవన ప్రమాణాలు పెంచే విధంగా విద్యా విధానం ఉండాలని అధికారులకు సూచన
Advertisement
జీవన ప్రమాణాలు పెంపొందించే విధంగా విద్యా విధానం ఉండాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు. ఉత్తమ విద్యా వ్యవస్థ కోసం ఒక పాలసీని రూపొందించాలని విద్యాశాఖ అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. విద్యా కమిషన్, విద్యాశాఖపై ఆయన సమీక్ష నిర్వహించారు.

క్షేత్రస్థాయి పరిస్థితులకు అనుగుణంగా, ఆచరణ సాధ్యమయ్యేలా పాలసీ ఉండాలని ఆయన అన్నారు. జీవన ప్రమాణాలు పెంచే విధంగా విద్యావిధానం ఉండాలని అధికారులకు సూచించారు. భాషతో పాటు, విద్యార్థుల్లో విషయ పరిజ్ఞానం పెంచేలా ఈ పాలసీ ఉండాలని అన్నారు. ఉత్తమ విద్యా వ్యవస్థ కోసం ఎంత ఖర్చైనా కాంగ్రెస్ ప్రభుత్వం వెనుకాడబోదని ఆయన స్పష్టం చేశారు.
Advertisement
Advertisement
Revanth Reddy
Telangana Education Policy
Telangana Chief Minister
Education Reforms
Educational Commission
School Education

More Telugu News