సీఐడీ కార్యాలయానికి వచ్చిన పోసాని కృష్ణమురళి

  • పలు షరతులతో పోసానికి బెయిల్ ఇచ్చిన కోర్టు
  • ప్రతి సోమ, గురువారాల్లో సీఐడీ కార్యాలయంలో సంతకం చేయాలని షరతు
  • కోర్టు ఆదేశాల మేరకు సీఐడీ కార్యాలయంలో సంతకం చేసిన పోసాని
సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ లపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో సినీ నటుడు పోసాని కృష్ణమురళి రిమాండ్ ఖైదీగా కొన్ని రోజుల పాటు జైలు జీవితాన్ని అనుభవించారు. రోజుకు ఒక జైలు అన్నట్టుగా ఆయన జీవితం గడిచింది. ఆయనకు బెయిల్ రావడంతో జైలు నుంచి బయటకు వచ్చారు. ప్రతి సోమ, గురువారాల్లో మంగళగిరిలోని సీఐడీ కార్యాలయంలో సంతకం చేయాలన్న గుంటూరు కోర్టు బెయిల్ షరతుల ప్రకారం ఆయన ఈరోజు సీఐడీ కార్యాలయానికి వచ్చారు. కోర్టు ఆదేశాల మేరకు సీఐడీ కార్యాలయంలో సంతకం చేశారు. 

పోసానికి కోర్టు విధించిన షరతులు ఇవే:
  • దేశం విడిచి వెళ్లకూడదు.
  • కేసు గురించి బహిరంగంగా మాట్లాడకూడదు. మీడియాకు ప్రకటనలు ఇవ్వరాదు.
  • నాలుగు వారాల పాటు ప్రతి మంగళ, గురు వారాల్లో మంగళగిరిలోని సీఐడీ కార్యాలయంలో సంతకం చేయాలి.
  • కేసు దర్యాప్తుకు పూర్తిగా సహకరించాలి.


More Telugu News