రాజ‌స్థాన్ రాయ‌ల్స్‌కు తీపి క‌బురు... సంజూ శాంస‌న్‌కు లైన్ క్లియ‌ర్‌

Sanju Samson Clears Fitness Test Back as RR Captain
  • ఐపీఎల్ కు ముందు సంజూ కుడి చేతి చూపుడు వేలికి గాయం 
  • గ‌త 3 మ్యాచ్‌ల‌లో కేవ‌లం బ్యాటింగ్ మాత్ర‌మే చేసిన వైనం
  • తాజాగా ఫిట్‌నెస్ టెస్టుల్ని క్లియ‌ర్ చేయ‌డంతో ఎన్‌సీఏ నుంచి గ్రీన్ సిగ్న‌ల్
  • వికెట్ కీపింగ్‌, కెప్టెన్సీ బాధ్య‌త‌ల్ని చేప‌ట్టేందుకు సంజూకు లైన్ క్లియ‌ర్
సంజూ శాంస‌న్ తిరిగి రాజ‌స్థాన్ రాయ‌ల్స్ (ఆర్ఆర్‌) కెప్టెన్‌గా మైదానంలోకి అడుగుపెట్ట‌నున్నాడు. వికెట్ కీపింగ్‌, కెప్టెన్సీ బాధ్య‌త‌ల్ని స్వీక‌రించేందుకు ఆయ‌న‌కు బీసీసీఐ ఆమోదం తెలిపింది. ఈ ఏడాది ఐపీఎల్ కు ముందు కుడి చేతి చూపుడు వేలికి గాయం కావ‌డంతో గ‌త మూడు మ్యాచ్‌ల‌లో సంజూ కేవ‌లం బ్యాటింగ్‌కు మాత్ర‌మే వ‌స్తున్న విష‌యం తెలిసిందే. 

తాజాగా ఫిట్‌నెస్ టెస్టుల్ని క్లియ‌ర్ చేయ‌డంతో బెంగ‌ళూరులోని జాతీయ క్రికెట్ అకాడ‌మీ (ఎన్‌సీఏ) గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింది. దీంతో వికెట్ కీపింగ్‌, కెప్టెన్సీ బాధ్య‌త‌ల్ని చేప‌ట్టేందుకు సంజూకు లైన్ క్లియ‌ర్ అయింది. 

కాగా, సంజూ శాంస‌న్ స్థానంలో గ‌త మూడు మ్యాచ్‌ల‌కు యువ ఆట‌గాడు రియాన్ పరాగ్ సార‌థ్య బాధ్య‌త‌లు చేప‌ట్టిన విష‌యం తెలిసిందే. ఇందులో రాజస్థాన్ ఒక‌టి గెల‌వ‌గా, మ‌రో రెండింటిలో ప‌రాజ‌యం పాలైంది. 


Go Back to Shorts
Sanju Samson
Rajasthan Royals
IPL
Captain
BCCI
Fitness Test
NCA
Cricket
Ryan Parag
Wicket-keeper

More Telugu News