హ‌రీశ్‌రావు, కేటీఆర్ ఇళ్ల వ‌ద్ద భారీగా పోలీసుల మోహ‌రింపు

  
కంచ గ‌చ్చిబౌలి భూముల వ్య‌వ‌హారంపై వివాదం నేప‌థ్యంలో బీఆర్ఎస్ నేత‌ల ఇళ్ల వ‌ద్ద భారీగా పోలీసుల‌ను మోహ‌రించారు. ఈ క్ర‌మంలో బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌, మాజీ మంత్రి హ‌రీశ్‌రావు నివాసాల వ‌ద్ద‌కు భారీగా పోలీసులు చేరుకున్నారు. వారిని ఇంటి నుంచి బ‌య‌ట‌కు రాకుండా అడ్డుకుంటున్నారు. 

మ‌రోవైపు హెచ్‌సీయూ వ‌ద్ద కూడా భారీగా పోలీసులు మోహ‌రించారు. అక్క‌డ నిర‌స‌న‌కు దిగిన సీపీఎం, సీపీఐ, బీజేవైఎం నేత‌ల‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని న‌గ‌రంలోని వివిధ పోలీస్ స్టేష‌న్‌ల‌కు త‌ర‌లించారు. పోలీసులు అరెస్ట్ చేసిన వారిలో చికోటి ప్ర‌వీణ్ కూడా ఉన్నారు. 


More Telugu News