ఫిలిప్పీన్స్‌కు తెలంగాణ నుంచి బియ్యం ఎగుమతులు ప్రారంభం

  • బియ్యం ఎగుమతులను ప్రారంభించిన ఉత్తమ్ కుమార్ రెడ్డి
  • కాకినాడకు తరలించి అక్కడి నుంచి ఫిలిప్పీన్స్‌కు రవాణా
  • ట్రంగ్ ఎన్ నౌక ద్వారా 12,500 టన్నుల బియ్యం ఎగుమతి
  • ఏడాదికి 8 లక్షల టన్నుల ఎంటీయూ-1010 బియ్యం ఎగుమతి
ఫిలిప్పీన్స్ దేశానికి బియ్యం ఎగుమతులను తెలంగాణ రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రారంభించారు. తెలంగాణకు చెందిన బియ్యాన్ని కాకినాడకు తరలించి, అక్కడి నుంచి ఫిలిప్పీన్స్‌కు రవాణా చేస్తున్నారు. తాజాగా ట్రంగ్ ఎన్ నౌక ద్వారా 12,500 టన్నుల ఎంటీయూ-1010 రకం బియ్యాన్ని ఎగుమతి చేశారు.

మొత్తం 8 లక్షల టన్నుల బియ్యాన్ని ఎగుమతి చేసేందుకు ఫిలిప్పీన్స్‌తో తెలంగాణ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. ఎంటీయూ-1010 దొడ్డు రకం బియ్యం కాగా, ఈ బియ్యం కావాలని ఫిలిప్పీన్స్ గత ఏడాది కోరింది.


More Telugu News