రోహిత్ శర్మను ఉద్దేశించి హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ సంచలన వ్యాఖ్యలు
- కొనసాగుతున్న రోహిత్ శర్మ పేలవ ఫామ్
- రోహిత్ పరిస్థితి చూసి జాలి వేసిందన్న సీవీ ఆనంద్
- అప్పుడప్పుడు మాత్రమే పరుగులు చేస్తుంటే రోహిత్ కు గౌరవం దక్కుతుందా? అని ప్రశ్న
ఐపీఎల్ లో వరుసగా రెండు మ్యాచ్ లలో రోహిత్ తక్కువ స్కోరుకే ఔటయ్యాడని... ఇలాంటి పరిస్థితుల్లో కెరీర్ ను కొనసాగించే బదులు, రిటైర్ కావడమే బెటర్ అని ఆనంద్ చెప్పారు. అనుకోకుండా తాను ముంబై ఇండియన్స్ - గుజరాత్ టైటాన్స్ మ్యాచ్ చూశానని... తాను చూస్తున్న సమయంలోనే రోహిత్ ఔటయ్యాడని తెలిపారు. రోహిత్ పరిస్థితి చూసి తనకు జాలి వేసిందని చెప్పారు.
ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్స్ వంటి అరుదైన సందర్భాల్లోనే రోహిత్ పరుగులు చేస్తున్నాడని... అప్పుడప్పుడు మాత్రమే పరుగులు చేస్తుంటే రోహిత్ కు గౌరవం దక్కుతుందా? అని వ్యాఖ్యానించారు. ఎంతో గొప్ప క్రికెట్ కెరీర్ ఉన్న రోహిత్... గౌరవప్రదంగా రిటైర్ అయితే బాగుంటుందని చెప్పారు. రోహిత్ ఔటైన వీడియోను కూడా ఆయన షేర్ చేశారు. ఆనంద్ చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.