మాకు దిష్టి తగిలింది అధ్యక్షా..!: మల్లారెడ్డి
- శాసనసభలో నవ్వులు పూయించిన మల్లారెడ్డి
- దిష్టి తగిలి తమ జిల్లాలోని గ్రామాలన్నీ మున్సిపాలిటీలు అయ్యాయని వ్యాఖ్య
- తమను జీహెచ్ఎంసీలో కలపొద్దని విన్నపం
స్పీకర్ సూచనతో మాట్లాడటం మొదలుపెట్టిన మల్లారెడ్డి... తమ మేడ్చల్ నియోజకవర్గానికి దిష్టి తగిలింది అధ్యక్షా అని అన్నారు. దీంతో, సభలో నవ్వులు విరబూశాయి. ఏం దిష్టి తగిలిందో కానీ... జిల్లాలోని గ్రామాలన్నీ పోయి మున్సిపాలిటీలు అయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. దయచేసి తమను జీహెచ్ఎంసీలో కలపొద్దని కోరారు. అనంతరం ప్రభుత్వానికి లాభం చేకూరే విషయం చెబుతానంటూ మాట్లాడే ప్రయత్నం చేసినా ఆయనకు స్పీకర్ అనుమతిని ఇవ్వలేదు.