స్పామ్ కాల్స్‌కు చెక్.. ‘ట్రూకాలర్’ అవసరం ఇక తీరిపోయినట్టే!
- కాలర్ ఐడీ సదుపాయాన్ని తీసుకొస్తున్న సర్వీస్ ప్రొవైడర్లు
- తొలుత సేమ్ నెట్‌వర్క్ మధ్య కాలర్ ఐడీ సదుపాయం
- రంగం సిద్ధం చేస్తున్న జియో, ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా
దశల వారీగా ఈ సేవలు అందుబాటులోకి రానుండగా, తొలుత ఏ నెట్‌వర్క్ యూజర్‌కు అదే నెట్‌వర్క్ నుంచి వచ్చే కాల్స్‌కు మాత్రమే ఈ సేవలు అందుబాటులోకి రానున్నాయి. జియో యూజర్‌కు ఎయిర్‌టెల్ నుంచి కానీ, వొడాఫోన్ నుంచి కానీ వచ్చే కాల్స్‌కు ఇది వర్తించదు. అయితే, టెలికం కంపెనీలు తమ వద్ద ఉన్న సమాచారాన్ని పరస్పరం పంచుకునేందుకు అంగీకరిస్తే అప్పుడు ఏ నెట్‌వర్క్ నుంచి ఎవరు ఫోన్ చేసినా కాలర్ ఐడీ సదుపాయం అందుబాటులోకి వస్తుంది. ఈ సేవలు అందుబాటులోకి వస్తే స్పామ్ కాల్స్‌కు చెక్ పడినట్టే.