రాహుల్ గాంధీపై యోగి సంచలన వ్యాఖ్యలు
- ఆయన వల్ల కాంగ్రెస్ కంటే బీజేపీకే ఎక్కువ లాభమని వ్యాఖ్య
- రాహుల్ ఉద్దేశాన్ని ప్రజలు గ్రహిస్తున్నారన్న యూపీ ముఖ్యమంత్రి
- విదేశాల్లో భారతదేశంపై ఆయన చేసే విమర్శలు గమనిస్తున్నారని వెల్లడి
రాహుల్ గాంధీ మనస్తత్వాన్ని జనం గుర్తిస్తున్నారని తెలిపారు. ఆయనలాంటి నేతలు ప్రతిపక్షంలో ఉండటం బీజేపీకి ఎంతో లాభిస్తుందని సెటైర్ వేశారు. కాంగ్రెస్ పార్టీ అయోధ్య రామ మందిరం అంశాన్ని వివాదాస్పదం చేయాలని ప్రయత్నించిందని ఆరోపించారు. దేశాన్ని సుదీర్ఘ కాలం పాలించిన కాంగ్రెస్ పార్టీ.. ముస్లిం మహిళల సమస్యలకు పరిష్కారం ఎందుకు చూపలేకపోయిందని యోగి ప్రశ్నించారు. ట్రిపుల్ తలాక్ ను ఎందుకు రద్దు చేయలేకపోయిందని, కుంభమేళాను గర్వంగా ఎందుకు ప్రమోట్ చేయలేకపోయిందని నిలదీశారు. ప్రపంచ దేశాలకు దీటుగా భారత్ ను ఎందుకు నిర్మించలేకపోయిందని యోగి ప్రశ్నించారు.