పదవులు రాకుంటే అసంతృప్తి సహజమే: కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి
- తానూ అసంతృప్తితోనే ఉన్నానన్న జీవన్ రెడ్డి
- మంత్రివర్గ విస్తరణకు అధిష్ఠానం పచ్చజెండా
- ఈ నేపథ్యంలో జీవన్ రెడ్డి వ్యాఖ్యలకు ప్రాధాన్యత
నిన్న పార్టీ అగ్రనేతలు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, కే.సీ. వేణుగోపాల్‌తో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తదితరులు సమావేశమయ్యారు. ఈ సమావేశంలో మంత్రివర్గ విస్తరణతో పాటు తాజా రాజకీయ అంశాలపై చర్చించారు.