నేడు ఆరోగ్య శాఖ కమిషనరేట్ ముట్టడికి ఆశా వర్కర్ల పిలుపు .. ఎక్కడికక్కడ నేతల అరెస్టులు
- తమ సమస్యలు పరిష్కరించాలంటూ ఆశా వర్కర్ల ఆందోళన
- చలో హైదరాబాద్ కు పిలుపునిచ్చిన ఆశా వర్కర్లు
- ఎక్కడికక్కడ ఆశా వర్కర్లను అదుపులోకి తీసుకుంటున్న పోలీసులు
ఈ డిమాండ్లపై కోఠిలోని ఆరోగ్య శాఖ కమిషనర్ కార్యాలయం వద్ద ధర్నా చేపట్టాలని వారు నిర్ణయించారు. ఆశా వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో 'చలో హైదరాబాద్' పిలుపు నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఆశా వర్కర్లు హైదరాబాద్ కు తరలి రాకుండా అడ్డుకునేందుకు రాష్ట్ర వ్యాప్తంగా పోలీసులు ఎక్కడికక్కడ అరెస్టులు చేస్తున్నారు. ఆదివారం వేకువజాము నుంచే ఆశా వర్కర్లు బయటకు రాకుండా పోలీసులు చర్యలు చేపట్టారు. హైదరాబాద్లో ఆశా వర్కర్ల ఆందోళనకు అనుమతి లేదని పోలీసులు చెబుతున్నారు.