TTD: టీటీడీ కీలక ప్రకటన .. ఆ రెండు రోజుల్లో వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు

Tirumala Temple VIP Darshan Cancelled on 25th and 30th
షార్ట్స్‌లో చూడండి
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) వీఐపీ బ్రేక్ దర్శనాలకు సంబంధించి కీలక ప్రకటన చేసింది. తిరుమల శ్రీవారి ఆలయంలో ఈ నెల 25న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం వేడుక, 30న ఉగాది వేడుక జరగనున్నాయి.

ఈ నేపథ్యంలో 25, 30 తేదీల్లో వీఐపీ బ్రేక్ దర్శనాలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు శనివారం టీటీడీ ఓ ప్రకటన విడుదల చేసింది. ఆ రెండు రోజుల్లో బ్రేక్ దర్శనాలు రద్దు చేసినందున 24, 29 తేదీల్లో ఎలాంటి సిఫారసు లేఖలు స్వీకరించడం జరగదని స్పష్టం చేసింది.

తెలంగాణ ప్రజా ప్రతినిధుల సిఫారసు లేఖలను ఈ నెల 23న స్వీకరించి 24న దర్శనానికి అనుమతించనున్నట్లు ఆ ప్రకటనలో తెలిపింది. 
Go Back to Shorts
TTD
Tirumala Tirupati Devasthanams
VIP Break Darshan
Koil Aalwar Tiruvanjanam
Ugadi Festival
Temple Festival
Tirumala Temple
Cancellation
Recommendations
Andhra Pradesh

More Telugu News