ప్రధాని మోదీకి జగన్ లేఖ
- డీలిమిటేషన్ ప్రక్రియ గురించి మోదీకి జగన్ లేఖ
- జనాభా లెక్కల ప్రకారం డీలిమిటేషన్ లేకుండా చూడాలన్న జగన్
- దక్షిణాది రాష్ట్రాల ఎంపీ సీట్లు తగ్గకుండా చూడాలని విన్నపం
పార్లమెంట్ లో తీసుకునే నిర్ణయాల్లో అన్ని రాష్ట్రాలకు సమాన భాగస్వామ్యం కల్పించేలా ఉండాలని జగన్ చెప్పారు. అందుకే దక్షిణాది రాష్ట్రాల ఎంపీ సీట్లు తగ్గకుండా చూడాలని కోరారు. ఏ రాష్ట్రానికి ప్రాతినిధ్యం తగ్గకుండా డీలిమిటేషన్ కసరత్తు జరగాలని కేంద్రాన్ని కోరుతున్నానని చెప్పారు.
మరోవైపు డీలిమిటేషన్ ప్రక్రియను వ్యతిరేకిస్తూ తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ అధ్యక్షతన చెన్నైలో అఖిలపక్ష సమావేశం జరుగుతోంది. ఈ నేపథ్యంలో జగన్ ఆదేశాల మేరకు ఈ లేఖ సారాంశాన్ని డీఎంకేకు వైవీ సుబ్బారెడ్డి పంపించారు.