అరెస్టు చేయవద్దు, కానీ: యాంకర్ శ్యామలకు హైకోర్టులో ఊరట
- బెట్టింగ్ యాప్‌లను ప్రమోట్ చేసిన కేసులో శ్యామలపై కేసు
- పోలీసుల విచారణకు సహకరించాలని హైకోర్టు ఆదేశాలు
- సోమవారం నుండి విచారణకు హాజరు కావాలన్న హైకోర్టు
బెట్టింగ్ యాప్‌లను ప్రమోట్ చేసిన కేసులో యాంకర్ శ్యామలపై పంజాగుట్ట పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో సుమారు 11 మందిపై కేసులు నమోదు కాగా, వారందరినీ పోలీసులు విచారణకు పిలుస్తున్నారు. శ్యామల విచారణకు గైర్హాజరయ్యారు. ఈ నేపథ్యంలో శ్యామల హైకోర్టును ఆశ్రయించారు.
బెట్టింగ్ యాప్‌లకు సంబంధించి తనపై నమోదైన కేసును కొట్టివేయాలని ఆమె హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌ను విచారించిన న్యాయస్థానం పై ఆదేశాలు ఇచ్చింది.