వైసీపీకి మ‌రో షాక్‌

  • వైసీపీకి షాక్‌ల మీద షాక్‌లు 
  • ఇప్ప‌టికే ఆ పార్టీకి న‌లుగురు ఎమ్మెల్సీలు రాజీనామా
  •  తాజాగా ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్‌ రాజీనామా
ఏపీలో వైసీపీకి షాక్‌ల మీద షాక్‌లు త‌గులుతున్నాయి. ఇప్ప‌టికే ఆ పార్టీకి న‌లుగురు ఎమ్మెల్సీలు రాజీనామా చేయ‌గా.. తాజాగా మ‌రో షాక్ త‌గిలింది. ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్సీ మ‌ర్రి రాజ‌శేఖ‌ర్ త‌న ప‌ద‌వికి, వైసీపీ స‌భ్య‌త్వానికి రాజీనామా చేశారు. ఇక ఇప్ప‌టికే ఎమ్మెల్సీలు పోతుల సునీత‌, క‌ర్రి ప‌ద్మ‌శ్రీ, జ‌య‌మంగ‌ళ వెంక‌ట‌ర‌మ‌ణ‌, బ‌ల్లి క‌ళ్యాణ చ‌క్ర‌వ‌ర్తి పార్టీ వీడిన విష‌యం తెలిసిందే. తాజాగా మర్రి రాజశేఖర్ రాజీనామాతో వైసీపీ అసంతృప్త ఎమ్మెల్సీల సంఖ్య ఐదుకి పెరిగింది.  




More Telugu News