విద్యార్థినులకు స్కూటీలు ఎప్పుడిస్తారంటూ ఎమ్మెల్సీ కవిత నిరసన.. వీడియో ఇదిగో!
––
అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ఎన్నికల ప్రచారంలో విద్యార్థినులకు ఉచితంగా స్కూటీలు ఇస్తామంటూ కాంగ్రెస్ పార్టీ, ప్రియాంక గాంధీ హామీ ఇచ్చారని ఎమ్మెల్సీ కవిత గుర్తుచేశారు. అధికారంలోకి వచ్చి 15 నెలలు గడుస్తున్నా స్కూటీల పంపిణీకి ఎలాంటి చర్యలు చేపట్టలేదని మండిపడ్డారు. రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్ పార్టీ చివరకు విద్యార్థినులనూ మోసం చేస్తోందని ఆరోపించారు. స్కూటీలు అందించాలని విద్యార్థినులు ప్రియాంకా గాంధీకి పోస్ట్ కార్డులు రాస్తున్నారని, ఇప్పటికైనా ఆడపిల్లలకు స్కూటీలు అందించాలని ఎమ్మెల్సీ కవిత డిమాండ్ చేశారు.