పార్టీ అవకాశమిస్తే రాజ్యసభకు వెళతా.. మనసులో మాట బయటపెట్టిన యనమల
- ఈ నెలాఖరుతో ముగియనున్న యనమల శాసనమండలి సభ్యత్వం
- రాజ్యసభకు వెళ్లకుంటే విశ్రాంతి తీసుకుంటానన్న సీనియర్ నేత
- రాజకీయాలు ఖరీదైనవిగా మారిపోయాయని ఆవేదన
ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలకు టీడీపీ అభ్యర్థుల్ని ప్రకటించిన రోజు సీఎం చంద్రబాబు తనతో మాట్లాడారని, ఫలానా వారిని ఎంపిక చేశామని చెబితే స్వాగతించానని చెప్పారు. రెండుసార్లు తనకు శాసనమండలి సభ్యుడిగా అవకాశం కల్పించినందుకు చంద్రబాబుకు కృతజ్ఞతలు చెప్పినట్టు పేర్కొన్నారు. రాజకీయాలు ఇప్పుడు ఖరీదైనవిగా మారిపోయాయని, ప్రజాస్వామ్యానికి ఇది మంచిది కాదని యనమల అభిప్రాయపడ్డారు.