జీడిమెట్ల పారిశ్రామికవాడలో భారీ అగ్ని ప్రమాదం
- సుభాష్ నగర్‌లో ప్లాస్టిక్ ట్రే గోదాంలో చెలరేగిన మంటలు
- మంటలు ఎగిసిపడి దట్టంగా అలుముకున్న పొగలు
- ఫైరింజన్లతో మంటలను ఆర్పివేస్తున్న అగ్నిమాపక సిబ్బంది
ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరిగినట్లు వివరాలు వెల్లడి కాలేదు.
మంటలు అంటుకున్నాయని గుర్తించిన కార్మికులు వెంటనే బయటకు పరుగెత్తుకుంటూ వచ్చారని పోలీసులు తెలిపారు. స్థానికులు ఈ ప్రమాదంపై అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారని వెల్లడించారు. గోదాంలో ఉన్న ప్లాస్టిక్, ఫైబర్ అన్నీ మంటల్లో కాలిపోయాయని తెలిపారు.