కరేబియన్‌ దేశంలో భారత సంతతి విద్యార్ధిని గల్లంతు

  • వర్జీనియాలో నివాసం ఉంటున్న భారత సంతతి విద్యార్థిని సుదీక్ష కోణంకి
  • స్నేహితులతో కలిసి కరేబియన్ దేశానికి విహారయాత్రకు వెళ్లిన సుదీక్ష అదృశ్యం
  • ఆచూకీ కోసం సముద్రంలో గాలింపు చర్యలు నిర్వహిస్తున్న పోలీసులు
కరేబియన్ దేశంలో భారత సంతతికి చెందిన విద్యార్ధిని అదృశ్యమైంది. అమెరికాలోని పిట్స్‌బర్గ్ యూనివర్శిటీలో చదువుతున్న సుదీక్ష కోణంకి గత వారం స్నేహితులతో కలిసి కరేబియన్ దేశానికి విహారయాత్రకు వెళ్లింది. 

డొమినికన్ రిపబ్లిక్‌లోని ప్రముఖ పర్యాటక పట్టణమైన వ్యూంటా కానా ప్రాంతానికి వెళ్లిన సుదీత్ర కోణంకి .. ఈ నెల 6న రియా రిపబ్లికా రిసార్ట్ వద్ద బీచ్ వెంట నడుచుకుంటూ వెళ్లింది. ఆ తర్వాత ఆమె తిరిగి రాకపోవడంతో స్నేహితులు పోలీసులను సంప్రదించారు.

డ్రోన్లు, హెలికాఫ్టర్లతో గత నాలుగు రోజులుగా పోలీసులు గాలింపు చర్యలు చేపట్టినా ఆమె ఆచూకీ లభించలేదు. దీంతో ఆమె బీచ్‌లో కొట్టుకుపోయి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. సముద్రంలో గాలింపు చర్యలు చేపట్టారు. 
 
భారతదేశానికి చెందిన సుదీక్ష తల్లిదండ్రులు రెండు దశాబ్దాల క్రితం అమెరికాకు వలస వెళ్లి అక్కడ శాశ్వత నివాస హోదా పొందారు. 20 ఏళ్ల నుంచి వర్జీనియాలో నివాసం ఉంటున్న సుదీక్ష కోణంకి ప్రస్తుతం పిట్స్‌బర్గ్ యూనివర్శిటీలో గ్రాడ్యుయేషన్ చదువుతోంది. 
   


More Telugu News