అసాధారణ ఆట... అసాధారణ ఫలితం... టీమిండియా విజయంపై ప్రధాని మోదీ స్పందన

  • ఛాంపియన్స్ ట్రోఫీలో విజేతగా నిలిచిన టీమిండియా
  • ఫైనల్లో న్యూజిలాండ్ పై 4 వికెట్ల తేడాతో గెలుపు
  • దేశం గర్విస్తోందన్న ప్రధాని మోదీ 
దుబాయ్ లో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో టీమిండియా విజయం సాధించడంతో యావత్ భారవతాని పులకించిపోయింది. వన్డే ఫార్మాట్ లో నిర్వహించిన ఈ టోర్నీలో టీమిండియా ఛాంపియన్ గా అవతరించింది. దీనిపై ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. ఒక అసాధారణ ఆట... ఒక అసాధారణ ఫలితం అంటూ టీమిండియా గెలుపును కీర్తించారు. 

"ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీని ఇంటికి తీసుకువస్తున్న మన క్రికెట్ టీమ్ ప్రదర్శన పట్ల గర్విస్తున్నాను. టోర్నీ ఆసాంతం అద్భుతంగా ఆడారు. అమోఘమైన ఆల్ రౌండ్ షోతో అలరించిన మన జట్టుకు శుభాభినందనలు" అంటూ మోదీ సోషల్ మీడియాలో పేర్కొన్నారు.


More Telugu News