ఎస్ఎల్బీసీ ప్రమాదం.. కార్మికుల ఆనవాళ్లను గుర్తించిన జాగిలాలు
- గత నెల 22న కుప్పకూలిన ఎస్ఎల్బీసీ టన్నెల్
- సహాయక చర్యల్లో భాగంగా కేరళ నుంచి జాగిలాలు తెప్పించిన అధికారులు
- నేటి సాయంత్రానికి కార్మికులను గుర్తించే అవకాశం
ఐదేళ్ల సుదీర్ఘకాలం తర్వాత ఇటీవల ఎస్ఎల్బీసీ సొరంగం పనులు ప్రారంభమయ్యాయి. ఫిబ్రవరి 22న ఉదయం పనులు జరుగుతుండగా టన్నెల్ ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ క్రమంలో టన్నెల్ బోరింగ్ యంత్రానికి ఇటువైపున ఉన్న 42 మంది కార్మికులు ప్రాణాలతో బయటపడగా, అటువైపున చిక్కుకుపోయిన 8 మంది జాడ గల్లంతైంది. వారిని రక్షించేందుకు అప్పటి నుంచి సహాయ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. రోజులు గడుస్తుండటంతో లోపల చిక్కుకుపోయిన వారు మరణించి ఉంటారని భావిస్తున్నారు.