విజయసాయిరెడ్డి ఒత్తిడితోనే కోడెల శివప్రసాద్, శివరామకృష్ణపై కేసు.. మాజీ రంజీ క్రికెటర్ నాగరాజు
- కేసు పెట్టకుంటే రంజీల్లో ఆడనివ్వబోమని హెచ్చరించారు
- ఉద్యోగం కోసం రూ. 15 లక్షలు అడిగినట్టు వారి బెదిరింపులతోనే కేసు పెట్టా
- లోక్ అదాలత్‌లో రాజీపడ్డా: నాగరాజు
వైసీపీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి, ఆ పార్టీ మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డిల ఒత్తిడితోనే మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు, ఆయన కుమారుడు శివరామకృష్ణపై చీటింగ్ కేసు పెట్టినట్టు శ్రీకాకుళం జిల్లాకు చెందిన మాజీ రంజీ క్రికెటర్ బుడుమూరి నాగరాజు తెలిపారు. నరసరావుపేటలో నిన్న జరిగిన లోక్ అదాలత్‌లో ఈ కేసులో రాజీపడినట్టు పేర్కొన్నారు.
రైల్వేలో ఉద్యోగం ఇప్పిస్తామని రూ. 15 లక్షల లంచం అడిగినట్టు కోడెల శివప్రసాదరావు, శివరామకృష్ణలపై కేసు పెట్టాలని 2019లో విజయసాయిరెడ్డి, గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డిలు తనను బెదిరించారని తెలిపారు. లేదంటే రంజీల్లో ఆడే అవకాశం ఇవ్వబోమని బెదిరించారని ఆరోపించారు. వారి బెదిరింపులతో నరసరావుపేట టూటౌన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్టు చెప్పారు. తనను ఆంధ్రా జట్టులో ఆడనివ్వరేమోనన్న భయంతోనే వారిపై కేసు పెట్టానని, తన ఫిర్యాదులో నిజం లేదని చెప్పారు. ఈ నేపథ్యంలో లోక్ అదాలత్‌కు హాజరై ఈ కేసులో రాజీపడినట్టు నాగరాజు వివరించారు.