జీహెచ్ఎంసీ పారిశుద్ధ్య కార్మికురాలికి అధికారి పాదపూజ
Advertisement

జీహెచ్ఎంసీ పారిశుద్ధ్య కార్మికురాలికి అధికారి పాదపూజ

GHMC officer washes feets of sanitation worker
  • కాప్రా సర్కిల్‌లో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు
  • కార్మికులకు పాదపూజ చేసిన పర్యవేక్షణ అధికారి సుదర్శన్
  • మహిళల ప్రాధాన్యతను వివరిస్తూ ఆటపాటలతో సందడి
తెలంగాణలోని హైదరాబాద్‌లో మహిళా పారిశుద్ధ్య కార్మికులకు ఒక అధికారి పాదపూజ చేశారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మేడ్చల్ జిల్లా కాప్రా సర్కిల్‌లో జీహెచ్ఎంసీ ఉద్యోగులు ఘనంగా వేడుకలు నిర్వహించారు.

ఈ సందర్భంగా మహిళా పారిశుద్ధ్య కార్మికులకు పర్యవేక్షణ అధికారి సుదర్శన్ సన్మానం చేశారు. అనంతరం, కార్మికురాలి పాదాలను కడిగి పూలుజల్లి పాదపూజ చేశారు.  మహిళల ప్రాధాన్యతను వివరిస్తూ అధికారులు, కార్మికులు ఆటపాటలతో సందడి చేశారు.
Advertisement
GHMC
Workers
Telangana

More Telugu News