సృష్టికి మూలమైన స్త్రీమూర్తులందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు: నారా లోకేశ్

  • నేడు ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే
  • సోషల్ మీడియాలో స్పందించిన నారా లోకేశ్
  • మహిళా శక్తి అపారం అంటూ సోషల్ మీడియాలో పోస్టు
  • సమాన అవకాశాలు కల్పిస్తే అద్భుతంగా రాణిస్తారని వెల్లడి 
నేడు (మార్చి 8) అంతర్జాతీయ మహిళా దినోత్సవం. ఈ సందర్భంగా ఏపీ విద్యా, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల  మంత్రి నారా లోకేశ్ నారీ లోకానికి విషెస్ తెలిపారు. సృష్టికి మూలమైన స్త్రీమూర్తులందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు అంటూ సోషల్ మీడియాలో పోస్టు చేశారు. 

మహిళా శక్తి అపారం... సమాన అవకాశాలు కల్పించి ప్రోత్సహిస్తే అద్భుతంగా రాణిస్తారని కొనియాడారు. "పార్టీ ఆవిర్భావం నుంచి మహిళా సాధికారతకు అన్ని విధాల అండగా నిలుస్తున్నాం. రాష్ట్రంలో మహిళా సంక్షేమం, భద్రత కోసం కూటమి ప్రభుత్వం అహర్నిశలు కృషి చేస్తోంది. రాష్ట్రంలోని ప్రతి మహిళ సామాజిక, ఆర్థిక పురోగతి సాధించాలనే లక్ష్యంతో పనిచేస్తున్నాం. తమ తమ రంగాల్లో మహిళలు మరిన్ని విజయాలను సాధిస్తూ, అందరికీ స్ఫూర్తిగా నిలవాలని ఆకాంక్షిస్తున్నాను" అంటూ లోకేశ్ పేర్కొన్నారు. 

ఈ సందర్భంగా ఓ కార్యక్రమంలో వందలాది మంది మహిళలతో  తీసుకున్న సెల్ఫీని లోకేశ్ పంచుకున్నారు. 


More Telugu News