'స్కైప్' కు మంగళం పాడుతున్న మైక్రోసాఫ్ట్

  • 2003లో ప్రారంభమైన స్కైప్
  • వీడియో కాలింగ్, వీడియో కాన్ఫరెన్సింగ్ ఫీచర్లతో గుర్తింపు
  • కానీ జూమ్, ఆపిల్ ఐమెసేజ్ ల రాకతో స్కైప్ కు తగ్గిన ఆదరణ
  • దాంతో స్కైప్ కు శాశ్వతంగా ముగింపు పలకాలని మైక్రోసాఫ్ట్ నిర్ణయం
  • స్కైప్ యూజర్లు తమ 'టీమ్స్' కు కనెక్ట్ కావాలన్న మైక్రోసాఫ్ట్ 
ఉచిత వీడియో కాల్స్, వీడియో కాన్ఫరెన్సింగ్ ఫీచర్లతో తీసుకువచ్చిన స్కైప్ మూతపడనుంది. ప్రస్తుతం స్కైప్ మాతృసంస్థ అయిన టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ ఈ మేరకు కీలక నిర్ణయం తీసుకుంది. స్కైప్ కు శాశ్వతంగా ముగింపు పలికేందుకు సిద్ధమైంది. 

2003లో స్కైప్ ప్రారంభం కాగా... 2011లో మైక్రోసాఫ్ట్ కొనుగోలు చేసింది. స్కైప్ ను ఇతర వీడియో కాలింగ్ వేదికలకు దీటుగా తీర్చిదిద్దాలని మైక్రోసాఫ్ట్ ఎన్ని ప్రయత్నాలు చేసినా, యూజర్లను ఆకట్టుకోలేకపోయింది. అదే సమయంలో జూమ్, ఆపిల్ ఐమెసేజ్ వంటి వేదికలు పాప్యులర్ అయ్యాయి. ముఖ్యంగా, కరోనా సంక్షోభం సమయంలో జూమ్ ఎంతటి ప్రజాదరణ పొందిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆ సమయంలోనే స్కైప్ యూజర్ల సంఖ్య భారీగా పడిపోయింది. 

ప్రస్తుతం స్కైప్ ను మూసివేస్తుండడంతో.. తమ యూజర్లు 'మైక్రోసాఫ్ట్ టీమ్స్' కు కనెక్ట్ కావాలని మైక్రోసాఫ్ట్ సూచించింది. మైక్రోసాఫ్ట్ టీమ్స్ కూడా వీడియో కాలింగ్, వీడియో కాన్ఫరెన్సింగ్ వేదికే.


More Telugu News