AP Govt: ఏపీ మైనార్టీ సంక్షేమ వసతి గృహాలకు గుడ్‌న్యూస్.. డైట్ బకాయిల విడుదల

AP Govt release of diet charges arrears
షార్ట్స్‌లో చూడండి
రాష్ట్రంలోని  మైనారిటీ సంక్షేమ వసతి గృహాలకు సంబంధించి పెండింగ్ డైట్ బకాయిల చెల్లింపుల కోసం రాష్ట్ర ప్రభుత్వం  రూ. 5.50 కోట్లు విడుదల చేసిందని ఏపీ న్యాయ మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ తెలిపారు. 2024 – 2025 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి డైట్ బకాయిల చెల్లింపుల కోసం నిధులను విడుదల చేసినట్లు బుధవారం అమరావతిలో విడుదల చేసిన ఒక ప్రకటనలో ఆయన పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన చెల్లింపులు ఏపీ మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా జరుగుతాయని ఆయన తెలిపారు. 
Go Back to Shorts
AP Govt
Diet Charges
Amaravati
NMD Farooq

More Telugu News