Nara Lokesh: ఎమ్మెల్యే బోడె ప్రసాద్ కుమారుడి వివాహ రిసెప్షన్ కు హాజరైన మంత్రి లోకేశ్

Nara Lokesh attends MLA Bode Prasad son wedding reception in Vijayawada
షార్ట్స్‌లో చూడండి
ఉమ్మడి కృష్ణా జిల్లా పెనమలూరు టీడీపీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్ కుమారుడి వివాహ రిసెప్షన్ కు విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ హాజరయ్యారు. విజయవాడ కానూరులోని వీఆర్ సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజ్ గ్రౌండ్స్ లో ఏర్పాటు చేసిన వివాహ రిసెప్షన్ కార్యక్రమానికి హాజరై నూతన వధూవరులు వెంకట్రామ్, రీతికాలను ఆశీర్వదించారు. వైవాహిక జీవితంలోకి అడుగుపెడుతున్న నూతన దంపతులకు ఈ సందర్భంగా మంత్రి శుభాకాంక్షలు తెలిపారు. 

కాగా, నారా లోకేశ్ రాకతో పెళ్లి వేదిక వద్ద భారీ కోలాహలం నెలకొంది. లోకేశ్ ను కలిసేందుకు, ఆయనతో సెల్ఫీలు దిగేందుకు జనాలు పోటీపడ్డారు. లోకేశ్ ఎవరినీ నిరాశపరచకుండా సెల్ఫీలకు అవకాశం ఇచ్చారు.
Go Back to Shorts
Nara Lokesh
Wedding Reception
Bode Prasad
Vijayawada
TDP

More Telugu News