ఆసీస్ 264 ఆలౌట్... టీమిండియా ఛేజింగ్ స్టార్ట్

Team India bundled out Aussies for 264 runs
  • నేడు ఛాంపియన్స్ ట్రోఫీ సెమీస్
  • టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆసీస్
  • రాణించిన టీమిండియా బౌలర్లు
ఛాంపియన్స్ ట్రోఫీ తొలి సెమీఫైనల్లో టీమిండియా, ఆస్ట్రేలియా తలపడుతున్నాయి. దుబాయ్ లో జరుగుతున్న ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన ఆసీస్ బ్యాటింగ్ ఎంచుకుంది. 49.3 ఓవర్లలో 264 పరుగులకు ఆలౌట్ అయింది. కెప్టెన్ స్టీవ్ స్మిత్ 73, అలెక్స్ కేరీ 61 పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడారు. 

ఓపెనర్ ట్రావిస్ హెడ్ 39, లబుషేన్ 29 పరుగులు చేశారు. మ్యాక్స్ వెల్ (7), జోష్ ఇంగ్లిస్ (11) విఫలమయ్యారు. టీమిండియా బౌలర్లలో షమీ 3, వరుణ్ చక్రవర్తి 2, రవీంద్ర జడేజా 2, హార్దిక్ పాండ్యా 1, అక్షర్ పటేల్ 1 వికెట్ తీశారు. కుల్దీప్ యాదవ్ కు ఒక్క వికెట్ కూడా దక్కలేదు. 

అనంతరం, 265 పరుగుల లక్ష్యఛేదనకు బరిలో దిగిన టీమిండియా 3 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 17 పరుగులు చేసింది. కెప్టెన్ రోహిత్ శర్మ 15, శుభ్ మన్ గిల్ 2 పరుగుతో క్రీజులో ఉన్నారు.
Go Back to Shorts
Champions Trophy 2025
Team India
Australia
Semifinal

More Telugu News