మ‌హ్మ‌ద్ సిరాజ్‌తో డేటింగ్‌... మ‌హిరా శ‌ర్మ ఏమ‌న్నారంటే..!

  • మ‌హ్మ‌ద్ సిరాజ్‌, మ‌హిరా శ‌ర్మ డేటింగ్‌లో ఉన్నారంటూ ఇటీవ‌ల‌ పుకార్లు
  • ఈ పుకార్లపై 'ఫిల్మీ జ్ఞాన్‌'కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తాజాగా స్పందించిన మ‌హిరా 
  • తాను ఎవ‌రితోనూ డేటింగ్‌లో లేన‌ని స్ప‌ష్టీక‌ర‌ణ‌
టీమిండియా బౌల‌ర్‌, హైద‌రాబాదీ ప్లేయ‌ర్‌ మ‌హ్మ‌ద్ సిరాజ్‌పై మ‌రోసారి డేటింగ్‌ వార్త‌లు వ‌చ్చాయి. హిందీ బిగ్ బాస్-13 సీజ‌న్ ఫేమ్ మ‌హిరా శ‌ర్మతో ఈ ఫాస్ట్ బౌల‌ర్ డేటింగ్‌లో ఉన్న‌ట్లు ఇటీవ‌ల‌ పుకార్లు పుట్టుకొచ్చాయి. అయితే, ఈ పుకార్లపై 'ఫిల్మీ జ్ఞాన్‌'కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తాజాగా మ‌హిరా స్పందించారు. తాను ఎవ‌రితోనూ డేటింగ్‌లో లేన‌ని ఆమె స్ప‌ష్టం చేశారు.  

"ఈ విష‌యంలో చెప్ప‌డానికి ఏమీ లేదు. నేను ఎవరితోనూ డేటింగ్ చేయడం లేదు. అభిమానులు మ‌మ్మల్ని ఎవరితోనైనా కనెక్ట్ చేయవచ్చు. మేము వారిని ఆపలేము. నేను ప‌నిచేసిన స‌హన‌టుల‌తో కూడా సంబంధం అంట‌గ‌ట్టారు. అటువంటి వాటిని నేను పెద్ద‌గా ప‌ట్టించుకోను" అని ఆమె చెప్పుకొచ్చారు.  

ఇక మహిరా శర్మ కంటే ముందు ఆమె తల్లి సానియా శర్మ 'టైమ్స్ నౌ'కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ పుకార్లను కొట్టిపారేశారు. ఇప్పుడు త‌న‌ కూతురు సెలబ్రిటీ కాబట్టి, జనాలు ఆమె పేరును ఎవరితోనైనా లింక్ చేస్తార‌ని ఆమె అన్నారు. వాటిని ఎవ‌రూ న‌మ్మొద్ద‌ని కోరారు.

కాగా, మహిరా శర్మ 'తారక్ మెహతా కా ఊల్టా చష్మా'తో తన కెరీర్‌ను ప్రారంభించారు. 'నాగిన్ 3', 'కుండలి భాగ్య', 'బేపనా ప్యార్ వంటి' టీవీ షోలతో ఆమెకు మంచి పేరు వ‌చ్చింది. అయితే, ఆమె సల్మాన్ ఖాన్ రియాలిటీ షో బిగ్ బాస్-13లో పాల్గొన‌డంతో బాగా ఫేమ‌స్ అయ్యారు.


More Telugu News