Sai Pallavi: మెగాస్టార్ చిరంజీవిపై సాయి ప‌ల్ల‌వి ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు

Actress Sai Pallavi Interesting Comments on Megastar Chiranjeevi
షార్ట్స్‌లో చూడండి
నేచుర‌ల్ బ్యూటీ సాయి ప‌ల్ల‌వి తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో మెగాస్టార్ చిరంజీవిపై ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. తాను చిన్న‌ప్పుడు చిరు డ్యాన్స్ చూసి ఫిదా అయ్యి, డ్యాన్స‌ర్ అవ్వాల‌ని నిర్ణ‌యించుకున్న‌ట్లు తెలిపారు. దీంతో ఇప్పుడు ఆమె చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 

సాయి ప‌ల్ల‌వి మాట్లాడుతూ... "నేను చిన్న‌ప్పుడు చిరంజీవి న‌టించిన 'ముఠామేస్త్రి' సినిమా తెగ చూసేదాన్ని. ఆయ‌న డ్యాన్స్‌కి ఫిదా అయ్యాను. ఆ త‌ర్వాత డ్యాన్స‌ర్ అవ్వాల‌ని నిర్ణ‌యించుకున్నాను. అలా డ్యాన్స్‌పై ఆస‌క్తితో వివిధ షోల‌లో పాల్గొన్నాను. ఒక ఈవెంట్‌లో చిరుతో డ్యాన్స్ చేయ‌డం నాకు జీవితాంతం మ‌రిచిపోలేని జ్ఞాప‌కం" అని సాయి ప‌ల్ల‌వి చెప్పుకొచ్చారు. 

కాగా, ఇటీవ‌ల తెలుగులో 'తండేల్' మూవీతో ఆమె సూప‌ర్ హిట్ అందుకున్న విష‌యం తెలిసిందే. 'ఫిదా' చిత్రంతో టాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన సాయి ప‌ల్ల‌వి... 'ఎంసీఏ', 'ల‌వ్‌స్టోరీ', 'శ్యామ్‌సింగ‌రాయ్' వంటి చిత్రాల‌తో మంచి పేరు తెచ్చుకున్నారు. ప్ర‌స్తుతం బాలీవుడ్‌లో ర‌ణ‌బీర్ క‌పూర్ స‌ర‌స‌న 'రామాయ‌ణ' మూవీలో సీత‌గా న‌టిస్తున్నారు. 
Go Back to Shorts
Sai Pallavi
Chiranjeevi
Tollywood

More Telugu News