ఆవిర్భావ సభ సమన్వయ కమిటీని ప్రకటించిన జనసేన
- మార్చి 14న జనసేన పార్టీ ఆవిర్భావ సభ
- పవన్ సొంత నియోజకవర్గం పిఠాపురంలో సభ
- ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న జనసేన హైకమాండ్
తాజాగా, జనసేన ఆవిర్భావ సభ సమన్వయ కమిటీని ప్రకటించారు. కాకినాడలో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూం నుంచి ఈ కమిటీ పనిచేయనుంది. ఈ సమన్వయ కమిటీ... క్రౌడ్ మేనేజ్మెంట్ కమిటీ, లాజిస్టిక్స్ కమిటీలతో సమన్వయం చేసుకుంటూ పనిచేస్తుందని జనసేన పార్టీ ఓ ప్రకటనలో వెల్లడించింది.
జనసేన ఆవిర్భాభ సభ సమన్వయ కమిటీ సభ్యులు వీరే...
- కందుల దుర్గేశ్
- బాలినేని శ్రీనివాసరెడ్డి
- ఏవీ రత్నం
- కొత్తపల్లి సుబ్బారాయుడు
- పి.హరిప్రసాద్
- పడాల అరుణ
- తమ్మినేని వెంకటేశ్వర్లు
- పాలవలస యశస్వి
- లింగోలు సత్యనారాయణ
- యిర్రింకి సూర్యారావు