Gorantla Butchaiah Chowdary: మంత్రి పదవిపై గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఆసక్తికర వ్యాఖ్యలు

Gorantla Butchaiah Chowdary comments on minister post
షార్ట్స్‌లో చూడండి
టీడీపీలో తానే అందరికంటే సీనియర్ అని, మంత్రి పదవి దక్కనందుకు తనకేమీ బాధలేదని రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి అన్నారు. రాజకీయపరంగా చూస్తే చంద్రబాబు తనకంటే సీనియర్ కావొచ్చేమో కానీ, టీడీపీలో మాత్రం చంద్రబాబు కంటే తానే సీనియర్ అని వెల్లడించారు. 

ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, తెలుగుదేశం పార్టీ ప్రారంభమైంది 1982లో అని, అప్పటినుంచి తాను పార్టీలో ఉన్నానని వివరించారు. పదవి ఇచ్చినా, ఇవ్వకపోయినా పార్టీ కోసం నిలబడ్డానని గోరంట్ల బుచ్చయ్య చౌదరి స్పష్టం చేశారు. 

"మొన్నటి ఎన్నికల తర్వాత మంత్రి పదవి ఇస్తారేమోనని ఆశించాను... కానీ ఇవ్వలేదు. వివిధ సమీకరణాలో, ఇంకేమైనా సామాజిక కారణాలో... నాకనవసరం. అంతమాత్రాన అసంతృప్తి చెందాల్సిన పనిలేదు. నా పని నేను చేసుకుంటూ పోతాను. 

నేను మొదటి నుంచి ఎన్టీఆర్ భక్తుడ్ని. రామారావు గారి కోసం ఆఖరుదాకా ఉన్నాను... ఉంటాను కూడా. 1996లో రామారావు గారి కోసం పోరాటం చేశాను. ఆ తర్వాత చంద్రబాబు పిలుపు మేరకు మళ్లీ టీడీపీలోకి వచ్చాను. అప్పటి నుంచి పార్టీలో బీఫారాలు ఇస్తున్నారు... గెలుస్తున్నాను... అలా జరిగిపోతూ ఉంది" అంటూ గోరంట్ల బుచ్చయ్య చౌదరి వివరించారు. రామారావుకు విధేయుడ్ని, చంద్రబాబుకు వ్యతిరేకిని అనే ముద్రతో మంత్రి పదవి ఇవ్వడంలేదు అనే వాదనలో నిజం లేదు అని స్పష్టం చేశారు. 

గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఇప్పటివరకు ఏడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఆయన తొలిసారిగా 1983లో గెలిచారు. మొత్తం 11 సార్లు పోటీ చేసిన ఆయన నాలుగు పర్యాయాలు మాత్రం ఓటమి చవిచూశారు.
Go Back to Shorts
Gorantla Butchaiah Chowdary
Minister Post
TDP
Rajahmundry Rural

More Telugu News