మరిన్ని వైద్య పరీక్షల కోసం పోసానిని కడప రిమ్స్ ఆసుపత్రికి తరలించిన పోలీసులు

  • రాజంపేట ఆసుపత్రిలో పోసానికి ఈసీజీ పరీక్షలు నిర్వహించిన వైద్యులు
  • గుండె కొట్టుకోవడంలో స్వల్ప తేడాలున్నట్టు గుర్తించిన డాక్టర్లు
  • కడప రిమ్స్ ఆసుపత్రికి తరలింపు
  • పోసాని విన్నపం మేరకు పరీక్షలు నిర్వహించామన్న రిమ్స్ వైద్యులు
  • 2డీ ఎకో పరీక్షలు నిర్వహించాలని వెల్లడి
రాజంపేట సబ్ జైల్లో ఉన్న సినీ నటుడు పోసాని కృష్ణమురళి అస్వస్థతకు గురయ్యారు. ఛాతీ నొప్పి వస్తోందని ఆయన చెప్పడంతో జైలు సిబ్బంది ఆయనను రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో ఆయనకు విరేచనాలు కూడా అయ్యాయి. ఆసుపత్రిలో కృష్ణమురళికి ఈసీజీ పరీక్షలు నిర్వహించారు. ఈసీజీలో ఆయన హృదయ స్పందనలో స్వల్ప తేడా ఉన్నట్టు వైద్యులు గుర్తించారు. దీంతో మెరుగైన వైద్య పరీక్షల కోసం కడప రిమ్స్ ఆసుపత్రికి పోలీసులు తరలించారు.

కడప రిమ్స్ ఆసుపత్రిలో పోసానికి మరిన్ని వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా వైద్యులు మాట్లాడుతూ పోసాని విన్నపం మేరకు పరీక్షలు నిర్వహించామని చెప్పారు. ఆయనకు 2డీ ఎకో పరీక్షలు నిర్వహించాలని తెలిపారు. పోసాని ముందు నుంచి గుండెకు సంబంధించి చికిత్స పొందుతున్నారని చెప్పారు. పోసాని ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉందని తెలిపారు.


More Telugu News