ఏపీలో రేపటి నుంచి ఇంటర్ ఎగ్జామ్స్
- మార్చి 1 నుంచి ఇంటర్ ఫస్టియర్ పరీక్షలు
- మార్చి 3 నుంచి సెకండియర్ ఎగ్జామ్స్
- రాష్ట్రవ్యాప్తంగా 1,535 పరీక్ష కేంద్రాలు
- పరీక్ష కేంద్రాల వద్ద సీసీ కెమెరాలు... 144 సెక్షన్ అమలు
ఇంటర్ పరీక్షల కోసం రాష్ట్రవ్యాప్తంగా 1,535 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. ప్రతి 20 ఎగ్జామ్ సెంటర్లకు ఒక ఫ్లయింగ్ స్క్వాడ్ ఉంటుంది. కాగా, విద్యార్థులు పరీక్ష సమయానికి గంట ముందే ఎగ్జామ్ సెంటర్ల వద్దకు చేరుకోవాల్సి ఉంటుంది. పరీక్ష కేంద్రాల వద్ద ఎటువంటి ఘటనలు జరగకుండా పోలీసులు 144 సెక్షన్ విధించారు. పరీక్ష కేంద్రాల వద్ద సీసీ కెమెరాలు అమర్చారు.
కాగా, ఇంటర్ ఫస్టియర్ పరీక్షలకు 5,00,963 మంది జనరల్ విద్యార్థులు... 44,581 మంది ఒకేషనల్ విద్యార్థులు హాజరుకానున్నారు. ఇంటర్ సెకండియర్ పరీక్షలకు 4,71,021 మంది జనరల్ విద్యార్థులు హాజరుకానున్నారు.