చెన్నై చేరుకున్న ధోనీకి ఘ‌న‌స్వాగ‌తం

  • ఐపీఎల్ 2025 కోసం చెన్నై చేరుకున్న ధోనీ
  • చెన్నై విమానాశ్ర‌యంలో ఘ‌న‌స్వాగ‌తం 
  • త్వ‌ర‌లో జ‌ర‌గబోయే సీఎస్‌కే ట్రైనింగ్ క్యాంప్‌లో ఎంఎస్‌డీ ప్రాక్టీస్
ఐపీఎల్ 2025 కోసం క్రికెట్ దిగ్గ‌జం మ‌హేంద్ర సింగ్ ధోనీ చెన్నై చేరుకున్నాడు. చెన్నై విమానాశ్ర‌యంలో ధోనీకి ఘ‌న‌స్వాగ‌తం ల‌భించింది. త్వ‌ర‌లో జ‌ర‌గబోయే చెన్నై సూప‌ర్ కింగ్స్ (సీఎస్‌కే) ట్రైనింగ్ క్యాంప్‌లో ఎంఎస్‌డీ ప్రాక్టీస్ చేయ‌నున్నాడు. ధోనీతో పాటు మ‌రికొంద‌రు ఆటగాళ్లు కూడా ఈ ట్రైనింగ్ క్యాంపులో పాల్గొన‌నున్నారు. 

కాగా, మార్చి 22న ఐపీఎల్ 18వ సీజ‌న్ ప్రారంభం కానున్న విష‌యం తెలిసిందే. ఇక చెన్నై జ‌ట్టు త‌న తొలి మ్యాచ్‌ను మార్చి 23న చైన్నైలోని చిదంబరం స్టేడియంలో ముంబ‌యి ఇండియ‌న్స్ (ఎంఐ)తో ఆడ‌నుంది. 

ఇక సీఎస్‌కే ధోనీ సార‌థ్యంలో చెన్నై సూపర్ కింగ్స్ ఐదుసార్లు ఐపీఎల్ టైటిల్ గెలిచిన విష‌యం తెలిసిందే. అయితే, గ‌తేడాది కెప్టెన్సీ నుంచి త‌ప్పుకున్న కెప్టెన్ కూల్‌... యువ ఆట‌గాడు రుతురాజ్ గైక్వాడ్‌కు సార‌థ్య బాధ్య‌త‌లు అప్ప‌గించాడు. 


More Telugu News