తిరుపతి డిప్యూటీ మేయర్ ఎన్నికపై హైకోర్టును ఆశ్రయించిన బీజేపీ నేత సుబ్రహ్మణ్యస్వామి

  • ఇటీవల తిరుపతి డిప్యూటీ మేయర్ ఎన్నిక
  • భయానక వాతావరణం సృష్టించారన్న సుబ్రహ్మణస్వామి
  • ఏపీ హైకోర్టులో తన పిల్ మార్చి 12న విచారణకు వస్తుందని వెల్లడి
బీజేపీ సీనియర్ నేత సుబ్రహ్మణ్యస్వామి గతంలో పార్టీలకు అతీతంగా పలు అంశాలపై న్యాయపోరాటం చేశారు. తాజాగా ఆయన ఏపీలో ఇటీవల తిరుపతి డిప్యూటీ మేయర్ ఎన్నిక జరిగిన తీరుపై స్పందించారు. ఈ డిప్యూటీ మేయర్ ఎన్నిక జరిగిన విధానం సరికాదంటూ సుబ్రహ్మణ్యస్వామి ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. 

ఈ ఎన్నిక వేళ భయానక వాతావరణం సృష్టించారని, హింసకు తెరలేపారని ఆరోపించారు. తిరుపతి డిప్యూటీ మేయర్ ఎన్నిక సమయంలో జరిగిన ఘటనలపై కేవలం ఎఫ్ఐఆర్ మాత్రమే నమోదు చేశారని, తదుపరి చర్యలు లేవని అన్నారు. ఈ మేరకు తాను ఏపీ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశానని, ఈ పిల్ మార్చి 12న విచారణకు వస్తుందని సుబ్రహ్మణ్యస్వామి వెల్లడించారు. 

ఎన్నికల వేళ జరిగే హింసను నివారించేలా కోర్టు చర్యలు తీసుకుంటే, దీనిపై చట్టం తయారయ్యేందుకు దారి చూపించినట్టవుతుందని అన్నారు.


More Telugu News