'ఆఫీసర్ ఆన్ డ్యూటీ' .. వసూళ్ల వరద!

  • మలయాళ సినిమాగా 'ఆఫీసర్ ఆన్ డ్యూటీ'
  • ఈ నెల 20వ తేదీన విడుదలైన సినిమా 
  • తొలిరోజుతోనే వచ్చిన హిట్ టాక్ 
  • అంతకంతకూ పెరుగుతున్న వసూళ్లు

మలయాళ సినిమాలు చూసేవారికి కుంచాకో బోబన్ గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన పనిలేదు. చూడటానికి హ్యాండ్సమ్ గా కనిపించినప్పటికీ, మాస్ ఆడియన్స్  నుంచి కూడా మంచి మద్దతును మూటగట్టే హీరో ఆయన. అలాంటి ఆయన తాజా చిత్రంగా 'ఆఫీసర్ ఆన్ డ్యూటీ' థియేటర్లకు వచ్చింది. ఈ నెల 20వ తేదీన విడుదలైన ఈ సినిమా, 4 రోజులలోనే 20 కోట్ల వసూళ్లను రాబట్టింది. 

ఈ సినిమాను కేవలం 12 కోట్ల బడ్జెట్ తో నిర్మించారు. అయితే 4 రోజులలోనే ఈ సినిమా, లాభాల బాట పట్టింది. ఏ రోజుకు ఆ రోజు ఈ సినిమా వసూళ్లు పెరుగుతున్నాయని చెబుతున్నారు. ఈ సినిమా స్ట్రీమింగ్ హక్కులను 'నెట్ ఫ్లిక్స్' వారు దక్కించుకున్నారు. వచ్చే నెల 2వ వారంలో స్ట్రీమింగుకు రానున్నట్టు తెలుస్తోంది. 

హరిశంకర్ - గీత భార్యాభర్తలు. హరిశంకర్ పోలీస్ ఆఫీసర్ గా పనిచేస్తూ ఉంటాడు. నీతి - నిజాయితీ కలిగిన పోలీస్ ఆఫీసర్ అతను. అలాంటి ఆయన నకిలీ బంగారానికి సంబంధించిన ఒక కేసును పరిష్కరించడం కోసం రంగంలోకి దిగుతాడు. అది తాను అనుకున్నంత చిన్నకేసు కాదని అర్థమవుతుంది. అప్పుడతను ఏం చేస్తాడు? ఆ తరువాత ఏమౌతుంది? అనేది కథ. 



More Telugu News