కోహ్లీ సెంచరీపై అనుష్క శర్మ స్పందన

  • పాకిస్థాన్‌పై విరాట్ కోహ్లీ సూపర్ సెంచరీ
  • కోహ్లీ సెంచరీపై సోషల్ మీడియా వేదికగా అనుష్క శర్మ హర్షం  
  • సోషల్ మీడియాలో వైరల్‌గా అనుష్క ఇన్‌స్టా స్టోరీ
ఛాంపియన్ ట్రోఫీలో దాయాది పాకిస్థాన్‌ను భారత్ మట్టికరిపించిన విషయం విదితమే. ఆదివారం దుబాయ్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో ఆరు వికెట్ల తేడాతో భారత్ విజయం సాధించి సెమీస్‌లో బెర్తును దాదాపు ఖరారు చేసుకుంది. గత కొంతకాలంగా ఫామ్ లేమితో విమర్శలు ఎదుర్కొంటున్న స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి ఈ మ్యాచ్‌లో అద్భుత ఇన్నింగ్స్‌తో సెంచరీ (100 నాటౌట్: 111 బంతుల్లో 7 ఫోర్లు) చేయడంతో అభిమానులు ఆనందంలో మునిగిపోయారు.

కోహ్లీ సెంచరీపై ఆయన అర్ధాంగి, నటి అనుష్క శర్మ హర్షం వ్యక్తం చేశారు. ఈ మ్యాచ్‌ను ప్రత్యక్ష ప్రసారం ద్వారా ఇంటి నుంచి చూసిన అనుష్క.. టీవీలో విరాట్ కోహ్లీ సెంచరీ సంబరాల ఫోటోను తీసి పంచుకున్నారు. దానికి లవ్, హైఫై ఎమోజీలను జత చేసి తన సంతోషాన్ని వ్యక్తం చేశారు. అంతకు ముందు సెంచరీ సాధించడంతో కోహ్లీ తన మెడలోని గొలుసుకు ఉన్న వెడ్డింగ్ రింగ్‌ను ముద్దాడాడు. అనుష్కకు సందేశమిచ్చేలా కెమెరాకు విక్టరీ సింబల్ చూపించాడు. ప్రస్తుతం అనుష్క చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 


More Telugu News