ఢిల్లీకి వెళుతున్న అమెరికా విమానానికి బాంబు బెదిరింపు.. ఎస్కార్ట్‌గా ఫైటర్ జెట్లు.. రోమ్‌లో అత్యవసర ల్యాండింగ్.. వీడియో ఇదిగో!
- 199 మంది ప్రయాణికులతో న్యూయార్క్ నుంచి ఢిల్లీకి బయలుదేరిన విమానం
- కాస్పియన్ సముద్రం మీదుగా వెళుతుండగా బాంబు ఉన్నట్టు పైలట్‌కు సమాచారం
- ఆ వెంటనే ఇటలీ రాజధానికి మళ్లింపు
- ఎస్కార్ట్‌గా యుద్ధ విమానాలను పంపిన ఇటలీ
అమెరికన్ ఎయిర్‌లైన్స్ విమానం ‘బోయింగ్ 787-9 డ్రీమ్ లైనర్’ ఆదివారం రాత్రి 199 మంది ప్రయాణికులతో ఢిల్లీకి బయలుదేరింది. విమానం కాస్పియన్ సముద్రం మీదుగా ఎగురుతుండగా విమానంలో బాంబు ఉన్నట్టు పైలట్‌కు సమాచారం అందింది. దీంతో వెంటనే విమానాన్ని ఇటలీ రాజధాని రోమ్‌కు మళ్లించారు. సమాచారం అందుకున్న ఇటలీ ఎయిర్‌ఫోర్స్ అధికారులు అమెరికన్ విమానానికి ఎస్కార్ట్‌గా యుద్ధ విమానాలను పంపించారు. వాటి రక్షణ మధ్య అమెరికా విమానం సురక్షితంగా రోమ్‌లో ల్యాండ్ అయింది. ఇందుకు సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.
విమానం ల్యాండ్ అయిన వెంటనే ప్రయాణికులను దింపి బాంబ్ స్క్వాడ్ తనిఖీలు చేపట్టింది. అనంతరం బాంబ్ బెదిరింపు కాల్ ఒట్టిదేనని తేల్చి విమానం ఢిల్లీకి వెళ్లేందుకు క్లియరెన్స్ ఇచ్చారు.