రేపటి గ్రూప్-2 పరీక్ష వాయిదా వేయలేం... ప్రభుత్వ లేఖకు బదులిచ్చిన ఏపీపీఎస్సీ
- ఏపీలో రేపు గ్రూప్-2 మెయిన్స్
- వాయిదా వేయాలంటున్న అభ్యర్థులు
- ఏపీపీఎస్సీకి లేఖ రాసిన రాష్ట్ర ప్రభుత్వం
- రేపటి పరీక్ష యథాతథంగా నిర్వహిస్తున్నామన్న ఏపీపీఎస్సీ
2023లో గ్రూప్-2 పరీక్షల కోసం విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం... రోస్టర్ పాయింట్ల విధానంలో తప్పులున్నాయని, వాటిని సరిదిద్దాకే గ్రూప్-2 మెయిన్స్ పరీక్ష నిర్వహించాలని గత కొన్ని రోజులుగా అభ్యర్థులు ఆందోళనలు చేపడుతున్నారు.
గ్రూప్-2 అభ్యర్థుల ఆందోళనలను పరిగణనలోకి తీసుకుని మెయిన్స్ పరీక్షను వాయిదా వేయాలని తాజాగా రాష్ట్ర ప్రభుత్వం ఏపీపీఎస్సీకి లేఖ రాసింది. అయితే, ఈ దశలో పరీక్షను వాయిదా వేయలేమని ఏపీపీఎస్సీ ప్రత్యుత్తరం ఇచ్చింది.