గ్రూప్-2 మెయిన్స్ పరీక్షల నిర్వహణపై క్లారిటీ ఇచ్చిన ఏపీపీఎస్‌సీ
- సోషల్ మీడియాలో గ్రూప్-2 మెయిన్స్ పరీక్షలు వాయిదా అంటూ ప్రచారం
- రేపు పరీక్షలు యథాతథంగా జరుగుతాయని కమిషన్ స్పష్టీకరణ
- అభ్యర్థులు 15 నిమిషాలు ముందుగానే ఎగ్జామ్ సెంటర్లకు చేరుకోవాలని సూచన
ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పేపర్-1, మధ్యాహ్నం 3.00 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు పేపర్-2 జరుగుతుందని కమిషన్ తెలిపింది. అభ్యర్థులు 15 నిమిషాలు ముందుగానే ఎగ్జామ్ సెంటర్లకు చేరుకోవాలని ఏపీపీఎస్‌సీ సూచించింది.