ఉత్కంఠ రేకెత్తించే సన్నివేశాలతో తమన్నా 'ఓదెల-2' టీజర్
- మిల్కీ బ్యూటీ తమన్నా ప్రధాన పాత్రలో ఓదెల-2
- మూవీకి కథను అందించిన ప్రముఖ దర్శకుడు సంపత్ నంది
- ఈ మూవీ టీజర్‌ను తాజాగా మహాకుంభ మేళాలో విడుదల చేసిన మేకర్స్
మిల్కీ బ్యూటీ తమన్నా ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ మూవీ టీజర్‌ను తాజాగా మేకర్స్ మహాకుంభ మేళాలో విడుదల చేశారు. తమన్నా లేడీ అఘోరాగా కనిపించిన ఈ టీజర్ ఉత్కంఠ రేకేత్తించే సన్నివేశాలతో ఆకట్టుకుందనే చెప్పాలి.
శివశక్తిగా తమన్నా నటన ప్రేక్షకులను ఆశ్చర్యపరిచేలా సాగింది. సంపత్ నందితో కలిసి మధు క్రియేషన్స్ పతాకంపై డి. మధు నిర్మిస్తున్న ఈ చిత్రానికి అజనీశ్ లోక్‌నాథ్ బాణీలు అందిస్తున్నారు.