ఒకే వేదికపై సీఎం రేవంత్ రెడ్డి, డీకే అరుణ... ఫొటో ఇదిగో!
- నారాయణపేట జిల్లాలో రేవంత్ పర్యటన
- అప్పక్ పల్లిలో మహిళా సమాఖ్య పెట్రోల్ బంకు ప్రారంభోత్సవానికి హాజరు
- ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన
- రేవంత్ రెడ్డితో పాటు పాల్గొన్న బీజేపీ ఎంపీ డీకే అరుణ
సీఎం రేవంత్ రెడ్డి నేడు నారాయణపేట జిల్లాలో పర్యటించారు. అప్పక్ పల్లిలో మహిళా సమాఖ్య పెట్రోల్ బంకును ప్రారంభించారు. ఈ సందర్భంగా మహిళా సమాఖ్య సభ్యులతో ముఖాముఖి సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆసక్తికర దృశ్యం చోటుచేసుకుంది. ఒకే వేదికపై సీఎం రేవంత్ రెడ్డి, బీజేపీ ఎంపీ డీకే అరుణ కనిపించారు. రేవంత్ రెడ్డిపై డీకే అరుణ పలు సందర్భాల్లో విమర్శలు చేస్తుండడం తెలిసిందే. ఈ నేపథ్యంలో, ఇద్దరూ ఒకే వేదికను పంచుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది.
ఇక, రేవంత్ రెడ్డి, డీకే అరుణ ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనుల శంకుస్థాపన కార్యక్రమంలోనూ పాల్గొన్నారు. ఈ పర్యటన సందర్భంగా పలుమార్లు రేవంత్, డీకే అరుణ నవ్వుతూ మాట్లాడుకోవడం కనిపించింది.
ఇక, రేవంత్ రెడ్డి, డీకే అరుణ ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనుల శంకుస్థాపన కార్యక్రమంలోనూ పాల్గొన్నారు. ఈ పర్యటన సందర్భంగా పలుమార్లు రేవంత్, డీకే అరుణ నవ్వుతూ మాట్లాడుకోవడం కనిపించింది.