కావాలంటే జగన్ కు చంద్రబాబు అపాయింట్ మెంట్ ఇప్పిస్తా: బీటెక్ రవి
- పులివెందుల ప్రజలపై జగన్ కు ప్రేమ లేదన్న బీటెక్ రవి
- పులివెందుల సమస్యలను తీర్చాల్సిన బాధ్యత ఎమ్మెల్యేగా జగన్ పై ఉందని వ్యాఖ్య
- పులివెందులకు ఉప ఎన్నికలు వచ్చే అవకాశం ఉందని కామెంట్
పులివెందుల సమస్యల పరిష్కారం కోసం సీఎం వద్దకు వస్తానంటే చంద్రబాబు అపాయింట్ మెంట్ ఇప్పిస్తానని రవి అన్నారు. అసెంబ్లీకి వెళ్లకపోవడం వల్ల పులివెందులకు ఉప ఎన్నిక వచ్చే అవకాశం ఉందని చెప్పారు. ఉప ఎన్నికల్లో జగన్ నిలబడ్డా గెలిచే అవకాశం లేదని అన్నారు.