టీటీడీ సేవలను సరళీకృతం చేస్తాం: నారా లోకేశ్
- శ్రీవారి దర్శనానికి పోటెత్తుతున్న భక్తులు
- దర్శనానికి భక్తులు బారులు తీరకుండా చర్యలు తీసుకుంటామన్న లోకేశ్
- టీటీడీ సేవలు ప్రపంచ వ్యాప్తంగా అందుబాటులోకి వచ్చాయని వ్యాఖ్య
ఈ నేపథ్యంలో ఏపీ మంత్రి నారా లోకేశ్ మాట్లాడుతూ... స్వామివారి దర్శనానికి భక్తులు బారులు తీరకుండా చర్యలు తీసుకుంటామని చెప్పారు. టికెట్ బుకింగ్, ఆలయ సర్వీసులను సరళీకృతం చేస్తామని తెలిపారు. టీటీడీ ఆన్ లైన్ సేవలు ప్రపంచ వ్యాప్తంగా అందుబాటులోకి వచ్చాయని... భక్తులను ఆలయాలకు మరింత చేరువ చేసేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. తిరుపతిలో జరుగుతున్న ఇంటర్నేషనల్ టెంపుల్స్ కన్వెన్షన్ అండ్ ఎక్స్ పో రెండో రోజు కార్యక్రమంలో లోకేశ్ మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.