సీఎం చంద్ర‌బాబు కృషి వ‌ల్లే అది సాధ్య‌మైంది: కేంద్రమంత్రి రామ్మోహ‌న్ నాయుడు

  • చంద్ర‌బాబు కృషితోనే కేంద్ర బ‌డ్జెట్ లో రాష్ట్రానికి కేటాయింపులు పెరిగాయ‌ని వ్యాఖ్య‌
  • గ‌త స‌ర్కార్ చేసిన త‌ప్పులు ఇప్పుడు నిధుల స‌మీక‌ర‌ణ‌కు అడ్డంకిగా మారాయ‌న్న మంత్రి
  • ఏపీలో డ‌బుల్ ఇంజిన్ ప్ర‌భుత్వం న‌డుస్తోంద‌న్న‌ రామ్మోహ‌న్ నాయుడు
గుంటూరులో నిర్వ‌హించిన మీడియా స‌మావేశంలో కేంద్ర‌మంత్రి కింజ‌రాపు రామ్మోహ‌న్ నాయుడు కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. సీఎం చంద్ర‌బాబు కృషితోనే కేంద్ర బ‌డ్జెట్ లో రాష్ట్రానికి కేటాయింపులు పెరిగాయ‌ని తెలిపారు. గ‌త ప్ర‌భుత్వం చేసిన త‌ప్పుల‌తో జ‌ల్‌జీవ‌న్ మిష‌న్ లో రూ. 15వేల కోట్ల న‌ష్టం వ‌చ్చింద‌న్నారు. కానీ, చంద్ర‌బాబు విజ్ఞ‌ప్తి మేర‌కు ఆ స్కీమ్ ను కేంద్రం మ‌రో ఏడాది పొడిగించింద‌ని చెప్పారు. 

గ‌త స‌ర్కార్ చేసిన త‌ప్పులు ఇప్పుడు నిధుల స‌మీక‌ర‌ణ‌కు అడ్డంకిగా మారాయ‌ని అన్నారు. అయితే, చంద్ర‌బాబు కృషితో ఎన్న‌డూ లేని విధంగా గ‌త ఏడు నెల‌ల్లో ఏపీకి కేంద్రం స‌హ‌కారం అందించింద‌ని పేర్కొన్నారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో డ‌బుల్ ఇంజిన్ ప్ర‌భుత్వం న‌డుస్తోంద‌ని కేంద్ర‌మంత్రి రామ్మోహ‌న్ నాయుడు అన్నారు.


More Telugu News