న్యూడ్ కాల్స్ చేయడం ద్వారా రూ. 18 లక్షల సంపాదన.. ఇక ఆపేద్దామనడంతో భర్త వేధింపులు!

  • తిరుపతి జిల్లా రామచంద్రాపురం మండలంలో ఘటన
  • కరోనా సమయంలో ఆర్థికంగా ఇబ్బంది పడిన జంట
  • ప్రైవేట్ యాప్ గురించి తెలిసి భార్యతో న్యూడ్ కాల్స్ చేయించిన భర్త
  • ఇక చేయలేనని చెప్పడంతో కొట్టి వెళ్లగొట్టిన భర్త
కరోనా సమయంలో ఆర్థిక ఇబ్బందులు ఎదురుకావడంతో వాటి నుంచి బయటపడేందుకు భర్త బలవంతంతో న్యూడ్ కాల్స్ చేసిందామె. ఇలా రెండున్నరేళ్లలో దాదాపు రూ. 18 లక్షలు సంపాదించారు. ఇక, ఇలా చేయడం తన వల్ల కాదని, ఇలాంటి పనులు చేయలేనని చెప్పడంతో ఆమెపై దాడిచేసి ఇంటి నుంచి వెళ్లగొట్టాడో భర్త. 

బాధితురాలి కథనం ప్రకారం.. తిరుపతి జిల్లా రామచంద్రాపురం మండలానికి చెందిన భార్యాభర్తలు కరోనా సమయంలో ఆర్థికంగా ఇబ్బంది పడ్డారు. పెయింటింగ్ పనిచేసే మహిళ భర్తకు ఓ ప్రైవేట్ యాప్‌లో న్యూడ్ కాల్స్ చేస్తే డబ్బులు వస్తాయని తెలిసింది. దీంతో భార్యకు నచ్చజెప్పి న్యూడ్ కాల్స్ మాట్లాడించేవాడు. ఇలా రెండున్నర సంవత్సరాల్లో రూ. 18 లక్షలు సంపాదించారు. ఇకపై ఈ తప్పు చేయలేనని, ఇక్కడితో దీనికి ఫుల్‌స్టాప్ పెట్టేద్దామని చెప్పడంతో భర్త ఆమెను వేధించడం మొదలుపెట్టాడు. భౌతిక దాడికి కూడా దిగాడు.

ఇటీవల గుర్తు తెలియని వ్యక్తులు కొందరు ఆమె ఫొటోలు, వీడియోలను సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేయడంతో అత్తింటివారి వేధింపులు ఎదురయ్యాయి. తనపై వారు దాడి చేస్తున్నారని ఆమె ఆరోపించారు. ఇంటి నుంచి వెళ్లగొట్టారని, పిల్లల్ని కూడా చూడనివ్వడం లేదని వాపోయారు. రామచంద్రాపురం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని, అదే స్టేషన్‌లో పనిచేసే కానిస్టేబుల్ ఒకరు తనకు అసభ్య సందేశాలు పంపుతున్నారని ఆరోపించారు. పోలీసులు ఉన్నతాధికారులు స్పందించి తనకు న్యాయం చేయాలని కోరారు.


More Telugu News